India: సౌదీ అరేబియా నుంచి భారత్‌కు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్!
- రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటన
- అదానీ గ్రూపు, లిండే కంపెనీ సహకారంతో రానున్న ఆక్సిజన్
- ట్వీట్ చేసిన అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ
భారత్‌లో కరోనా ఉద్ధృతి ఉగ్ర రూపం దాల్చి ప్రతి రోజు మూడు లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ అవుతుండడం కలకలం రేపుతోంది. దేశంలో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో పలు దేశాలు స్పందిస్తూ ప్రాణవాయువును సరఫరా చేస్తామని చెప్పాయి. ఆ జాబితాలో సౌదీ అరేబియా కూడా చేరింది.
భారత్‌కు 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అదానీ గ్రూపు, లిండే కంపెనీ సహకారంతో ఈ ఆక్సిజన్ పంపుతున్నట్లు వివరించింది. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు.
రియాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యామని అన్నారు. తాజాగా 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో నాలుగు క్రయోజనిక్ ట్యాంకులు సముద్ర మార్గం ద్వారా దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయని వివరించారు.