Corona Virus: ప్లేట్‌లెట్లు పడిపోయినా, తీవ్ర నీరసంగా ఉన్నా కొవిడ్ లక్షణమే: వైద్య నిపుణులు

Another two symptoms added in corona

  • ఈ రెండు లక్షణాలు ఉంటే కొవిడ్ లక్షణంగానే భావించాలి
  • సకాలంలో గుర్తించకుంటే ప్రాణాపాయం
  • హెచ్చరిస్తున్న వైద్యులు

కరోనా లక్షణాల్లో రోజుకోటి చేరుతోంది. వైద్య నిపుణులు మరో రెండు లక్షణాలను చేర్చారు. తీవ్ర నీరసంగా ఉన్నా, రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయినా కూడా కరోనా లక్షణాలుగా భావించాలని చెబుతున్నారు. ఇలాంటి లక్షణాలతో తమ వద్దకు వచ్చిన ఎంతోమందికి పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఈ రెండు లక్షణాలు ఉంటే అశ్రద్ధ వద్దని, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్లేట్‌లెట్లు పడిపోవడాన్ని సకాలంలో గుర్తించకుంటే ఆ తర్వాతి దశలో జ్వరం, శ్వాస తీసుకునే సమస్యలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 18న ఓ వ్యక్తి రక్త పరీక్ష చేయించుకోగా ప్లేట్‌లెట్లు 85 వేలకు పడిపోయాయి. వైద్యుడు రాసిచ్చిన మందులు వాడుతుండగానే ఐదు రోజుల తర్వాత శ్వాస సమస్య కూడా మొదలైంది. అనుమానంతో మరోమారు పరీక్ష చేయగా ప్లేట్‌లెట్లు 20 వేలకు పడిపోయాయి. దీంతో ఈసారి కరోనా పరీక్షలు చేయించగా వైరస్ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించేందుకు ప్రయత్నించగా ఆక్సిజన్ బెడ్లు లేక ఎవరూ చేర్చుకోలేదు. ఈ క్రమంలో వైద్య సాయం కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు కోల్పోయాడు.

  • Loading...

More Telugu News