Maharashtra: ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాలు!

22 Covid bodies crammed in one van triggers outrage in Maharashtra Beed

  • ఫొటోలు తీస్తుండగా ఫోన్లు లాక్కున్న పోలీసులు
  • మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ఘటన
  • దర్యాప్తునకు ఆదేశించిన జిల్లా కలెక్టర్
  • రెండే అంబులెన్సులున్నాయన్న ఆసుపత్రి డీన్
  • మరిన్ని అడిగినా స్పందన కరువని కామెంట్

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 22 కరోనా మృతదేహాలను ఒకే ఒక్క అంబులెన్సులో కుక్కి పంపించారు అధికారులు. అదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానమిచ్చారు. దానికి సంబంధించిన ఫొటోలు తీసిన వారి బంధువుల ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగిచ్చారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో జరిగింది. దీనిపై అధికారులు స్పందించారు.

అంబజోగైలోని స్వామి రామానందతీర్థ మరాఠ్వాడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఈ కరోనా మృతదేహాలను తీసుకెళ్లినట్టు చెప్పారు. ‘‘మా దగ్గర కేవలం రెండే అంబులెన్సులున్నాయి. మరిన్ని కావాలని అడిగినా ఎవరూ స్పందించలేదు. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమసంస్కారాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ అధికారులకు మృతదేహాలను అప్పగించడం మా బాధ్యత. వారు చేసిన దానికి మేమెలా బాధ్యులమవుతాం’’ అని ఆసుపత్త్రి డీన్ డాక్టర్ శివాజీ శుక్ర అన్నారు.

ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ ను ఆదేశించినట్టు బీద్ జిల్లా కలెక్టర్ రవీంద్ర జగ్తప్ చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News