TRS: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక.. కీలక అంశాలు వెల్లడి
- మద్యం దుకాణాలు, పబ్లు నిబంధనలు పాటించేలా చర్యలు
- మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు
- ఈ నెల 1 నుంచి 25 వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించి రాష్ట్రంలో వైరస్ కట్టడికి తీసుకుంటోన్న చర్యలపై వివరాలు తెలిపింది. కరోనా కట్టడి కోసం మద్యం దుకాణాలు, పబ్లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, మద్యం దుకాణాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారని వివరించింది.
ఈ నెల 1 నుంచి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించామని, వాటిలో 4.39 లక్షల ఆర్టీపీసీఆర్, 19.16 లక్షల ర్యాపిడ్ పరీక్షలు ఉన్నాయని వివరించింది. అదే సమయంలో మొత్తం 341 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉందని తెలిపింది. కరోనా నియంత్రణపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్లైన్లో కొనసాగుతున్నాయని చెప్పింది.