Devineni Uma: సీఐడీ విచారణకు హాజరైన దేవినేని ఉమ.. సీఐడీ కార్యాలయం వద్ద భారీ భద్రత!
- మంగళగిరి సీఐడీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన దేవినేని ఉమ
- హైకోర్టు మీద గౌరవంతో విచారణకు వచ్చానని వ్యాఖ్య
- జగన్ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ ఉమపై సీఐడీ కేసు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితం మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. దేవినేని ఉమ విచారణకు హాజరుకావడంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, వారిచ్చిన ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్ మాటలను మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... సీఐడీ విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.