Mamata Banerjee: అనూహ్యంగా ఆధిక్యంలోకి వ‌చ్చిన మ‌మ‌తా బెన‌ర్జీ

mamata banerjee on lead

  • నాలుగు రౌండ్ల అనంత‌రం ఆధిక్యంలోకి వ‌చ్చిన మ‌మ‌త‌
  • ఆరు రౌండ్ల ఓట్ల త‌ర్వాత ఆమెకు 1,427 ఓట్ల ఆధిక్యం
  • 201 స్థానాల్లో తృణ‌మూల్ ముందంజ‌
  • బీజేపీకి 85 స్థానాల్లో ఆధిక్యం

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో సీఎం మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వ‌చ్చారు. నాలుగు రౌండ్లు పూర్త‌య్యే స‌మ‌యంలో ఆమె  నందిగ్రాంలో  బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8,000 ఓట్ల వెనుకంజ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే, అనంత‌రం రౌండ్ల‌లో మాత్రం ఆమె అనూహ్యంగా పుంజుకున్నారు. ఆరు రౌండ్ల ఓట్ల త‌ర్వాత ఆమె 1,427 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

కాగా, ప‌శ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్ సంపూర్ణ అధిక్యం దిశ‌గా ప‌రుగులు తీస్తోంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 201 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు గానూ ఎన్నిక‌లు జ‌రిగాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 147 స్థానాల్లో గెల‌వాల్సి ఉంది.

ఇప్ప‌టికే అంతకంటే చాలా ఎక్కువ సీట్ల‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో కొన‌సాగుతోంది. ఇక బీజేపీ 85, వామ‌ప‌క్ష పార్టీలు 3, ఇత‌రులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. తృణ‌మూల్ కాంగ్రెస్ అత్య‌ధిక స్థానాల్లో కొన‌సాగుతోన్న నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు డ్యాన్సులు చేస్తూ, బాణ‌సంచా పేల్చుతూ సంబ‌రాలు చేసుకుంటున్నారు.




  • Loading...

More Telugu News