Oxygen: మీరేమైనా చేయండి.. ఢిల్లీకి మాత్రం ఆక్సిజన్ అందించండి: కేంద్రానికి చురకలంటించిన ఢిల్లీ హైకోర్టు

whatever you do you muast allocate full quota of oxygen to delhi

  • పూర్తికోటా ఆక్సిజన్‌ అందించాలని ఆదేశించిన కోర్టు
  • కొరత వల్ల అమలు చేయలేదన్న కేంద్రం
  • కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదన్న కోర్టు
  • 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాలని ఆదేశం

గతంలో తాము ఆదేశించినట్లుగా ఢిల్లీలోని ఆసుపత్రులకు సరిపడా ఆక్సిజన్‌ను అందించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. ఏమైనా చేసి ఢిల్లీకి అందించాల్సిన ఆక్సిజన్‌ కోటాను పూర్తి స్థాయిలో కేటాయించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల్ని అమలు చేయని ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో వివరించాలంటూ మొట్టికాయలు వేసింది.

‘‘మీరు కావాలంటే మీ తలను ఆస్ట్రిచ్‌ పక్షివలే ఇసుకలో ముంచండి’’.. ఢిల్లీకి మాత్రం ఆక్సిజన్‌ అందించాల్సిందేనంటూ కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ కోటా అయిన 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ అందించాల్సిందేనని.. 490 మెట్రిక్‌ టన్నులు కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారని.. మీరు కేటాయింపులు జరిపినట్లుగానే ఢిల్లీకి దాని కోటా ఆక్సిజన్‌ దానికి అందించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 30న జరిగిన విచారణలో ఢిల్లీకి కేంద్ర కేటాయింపుల మేరకు పూర్తి స్థాయి అక్సిజన్‌ అందించాలని కోర్టు ఆదేశించింది. కానీ, ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దాన్ని అమలు చేయలేకపోయామని కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News