Sensex: రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 424 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 121 పాయింట్లు లాభపడిన నిఫ్టీ
- 6 శాతం వరకు పెరిగిన సన్ ఫార్మా షేర్
దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. లోన్లపై మారిటోరియంను మరో రెండేళ్ల పాటు పొడిగించుకోవచ్చంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగింది. బ్యాంకింగ్ షేర్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 424 పాయింట్లు పెరిగి 48,677కి చేరుకుంది. నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 14,618 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (5.94%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.42%), యాక్సిస్ బ్యాంక్ (2.41%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.88%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-1.75%), ఏసియన్ పెయింట్స్ (-0.79%), హిందుస్థాన్ యూనిలీవర్(-0.57%).