Supreme Court: మేము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని తీసుకురావద్దు: కేంద్రానికి సుప్రీంకోర్టు వార్నింగ్

Dont Force Us To Take Serious Action Warns Supreme Court To Centre

  • కరోనా వల్ల ఎంతో మంది చనిపోతున్నారు
  • ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాల్సిందే
  • ఆక్సిజన్ సరఫరాపై ఎక్స్ పర్ట్ ప్యానల్ ఆడిట్ నిర్వహించాలి

కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి ప్రతి రోజు 700 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ ను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని... పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయని... ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేంత వరకు ఆక్సిజన్ సరఫరాను కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రతిరోజు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అనే విషయాన్ని తాము స్పష్టంగా చెపుతున్నామని... తాము కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిని రానివ్వొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి రాష్ట్రానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ పై ఎక్స్ పర్ట్ ప్యానల్ ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఎంతో మంది జీవితాలను కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొంది. 

  • Loading...

More Telugu News