Corona Virus: దేశంలో కొత్తగా 4 లక్షల మందికి పైగా కరోనా
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676
- నిన్న 4,187 మంది మృతి
- మృతుల సంఖ్య మొత్తం 2,38,270
- 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు
భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. నిన్న కొత్తగా 4,01,078 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న 3,18,609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,18,92,676కు చేరింది.
గడచిన 24 గంటల సమయంలో 4,187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,38,270కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,79,30,960 మంది కోలుకున్నారు. 37,23,446 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 16,73,46,544 మందికి వ్యాక్సిన్లు వేశారు.
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 30,04,10,043 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,08,344 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.