AP Govt: మామిళ్లపల్లె పేలుడు మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.10 లక్షలు: మంత్రి పెద్దిరెడ్డి

AP Govt announced immediate exgratia for Mamillapalle blast victims families

  • కడప జిల్లా మామిళ్లపల్లె వద్ద పేలుడు
  • జిలెటిన్ స్టిక్స్ అన్ లోడ్ చేస్తుండగా ఘటన
  • 10 మంది దుర్మరణం
  • ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు
  • ఐదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక
  • క్వారీ లీజుదారుడిపై చర్యలు తీసుకుంటామన్న మంత్రి

కడప జిల్లా మామిళ్లపల్లెలో ముగ్గురాయి గనుల వద్ద జరిగిన జిలెటిన్ స్టిక్స్ పేలుడు ఘటనలో 10 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తక్షణ పరిహారంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తున్నట్టు తెలిపారు.

మామిళ్లపల్లె పేలుడు ఘటనపై 5 ప్రభుత్వ శాఖలతో ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. 5 రోజుల్లో ఈ కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తుందని అన్నారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించామని, క్వారీ లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. పేలుడు పదార్థాల అన్ లోడింగ్ లో నిబంధనలు పాటించలేదని వెల్లడించారు.

  • Loading...

More Telugu News