COVID19: కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న కోహ్లీ
- అందరూ వేయించుకోవాలని విజ్ఞప్తి
- వంతు వస్తే లేట్ చేయొద్దని కోరిన విరాట్
- అంతకుముందే టీకా తీసుకున్న ధావన్, రహానే
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నాడు. టీకా తీసుకుంటున్న ఫొటోను నేడు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కోహ్లీ.. అందరూ తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరాడు. తమ వంతు రాగానే ఆలస్యం చేయకుండా టీకా తీసుకోవాలన్నాడు.
రెండ్రోజుల క్రితం డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు వారం క్రితమే టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇదిలావుంచితే, ఇంగ్లాండ్ లో జూన్ 18 నుంచి 22 వరకు జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టులో ఇంగ్లాండ్ లో టెస్ట్ సిరీస్ ఆడనుంది.