ambulance: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చే అంబులెన్సుల‌ను రెండో రోజూ అడ్డుకున్న‌ తెలంగాణ పోలీసులు

no permisions for ambulances

  • చికిత్స కోసం ఏపీ నుంచి వ‌స్తున్న క‌రోనా బాధితులు
  • తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో అడ్డ‌గింత‌
  • సెల్‌ఫోన్‌లో ఆసుప‌త్రి అనుమ‌తి ప‌త్రం ఉంటే స‌రిపోదు
  • ఆసుప‌త్రులు ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ చేయాలంటోన్న పోలీసులు

హైదరాబాదులో చికిత్స కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వస్తున్న కరోనా బాధితుల అంబులెన్సుల‌ను నిన్న తెలంగాణ‌ పోలీసులు అడ్డుకున్న విష‌యం తెలిసిందే.  తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో రెండో రోజు కూడా అటువంటి అంబులెన్సుల అడ్డ‌గింత కొన‌సాగుతోంది. ముఖ్యంగా హైద‌రాబాద్‌కు వ‌చ్చే అంబులెన్సులను నిలిపివేస్తున్నారు.

దీంతో కృష్ణా జిల్లా నుంచి వ‌చ్చే రోగులు మార్గమ‌ధ్యంలోనే అంబులెన్సుల్లో ప‌డిగాపులు కాస్తున్నారు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద ర‌హ‌దారిపైనే అంబులెన్సుల‌ను అడ్డుకుంటున్నారు.  ఆసుప‌త్రులలో ప‌డ‌క‌లు ఉన్నాయ‌ని, చేర్చుకుంటామ‌ని ఆయా ఆసుపత్రులు హామీ ఇస్తే  నిన్న ప‌లు అంబులెన్స్‌లను వ‌దిలారు. అయితే, సెల్‌ఫోన్‌లో ఆసుప‌త్రి అనుమ‌తి ప‌త్రం చూపిన‌ప్ప‌టికీ ఈ రోజు పోలీసులు వ‌ద‌లడం లేద‌ని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.

ఆసుప‌త్రులు ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి చెప్పాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా క‌నిక‌రం చూపించ‌డం లేద‌ని రోగుల‌ బంధువులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News