Sensex: వరుసగా రెండో రోజూ నష్టపోయిన మార్కెట్లు

Sensex closes 471 points low

  • 471 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 154 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పైగా నష్టపోయిన ఇండస్ ఇండ్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లు పెరగొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఈరోజు ఆచితూచి ట్రేడింగ్ చేశారు. నష్టాల్లో కొనసాగుతున్న అమెరికా మార్కెట్ల ప్రభావం కూడా మన మార్కెట్లపై పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 471 పాయింట్లు కోల్పోయి 48,690కి పడిపోయింది. నిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి 14,696 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ కంపెనీ (1.31%), మారుతి సుజుకి (1.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.93%), ఎన్టీపీసీ (0.53%), డాక్టర్ రెడ్డీస్ (0.16%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.35%), ఓఎన్జీసీ (-2.54%), యాక్సిస్ బ్యాంక్ (-2.23%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.12%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.97%).

  • Loading...

More Telugu News