Devineni Uma: హార్ట్ సర్జరీ జరిగిన రఘురామకృష్ణరాజును 35 మందితో అరెస్ట్ చేయించారు: దేవినేని ఉమ
- అక్రమ కేసులు బనాయించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు
- వాక్సిన్లు తెప్పించలేరు.. కానీ, ఇలాంటి పనులు చేస్తున్నారు
- తప్పుడు కేసులతో ప్రభుత్వానికి లేని ప్రతిష్ఠ ఎలా వస్తుంది?
ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. కరోనా సమయంలో సమర్థవంతంగా చర్యలు తీసుకోలేని ప్రభుత్వం తప్పుడు కేసులతో మభ్యపెట్టాలని చూస్తోందని ఆయన విమర్శించారు. రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏసీ సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయానికి సంబంధించి దినపత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన పోస్ట్ చేశారు.
'హార్ట్ సర్జరీ జరిగిన ఎంపీ రఘురామకృష్ణరాజును 35 మందితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. అక్రమ కేసులు బనాయించి బలవంతంగా కారులో తీసుకెళ్లారు. వాక్సిన్లు తెప్పించలేరు.. అంబులెన్సులను బోర్డర్ దాటించలేరు. ప్రజల ప్రాణాలు కాపాడలేరు. తప్పుడు కేసులతో ప్రభుత్వానికి లేని ప్రతిష్ఠ ఎలా వస్తుంది వైఎస్ జగన్?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.