Radhe: ఓటీటీలో విడుదలైన 'రాధే'కి పైరసీ బెడద... సల్మాన్ ఆగ్రహం
- సల్మాన్, దిశా పటానీ జంటగా 'రాధే'
- ప్రభుదేవా దర్శకత్వంలో సినిమా
- గురువారం జీప్లెక్స్ ఓటీటీలో రిలీజ్
- కొన్ని గంటల్లోనే ఆన్ లైన్ లో ప్రత్యక్షం
ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, దిశా పటానీ జంటగా నటించిన చిత్ర 'రాధే' గురువారం జీప్లెక్స్ ఓటీటీ వేదికలో విడుదలైంది. అయితే, కొన్ని గంటల్లోనే ఈ చిత్రం ఆన్ లైన్ లో లీకైంది. 'రాధే' ప్రభంజనంతో జీప్లెక్స్ ఓటీటీ సర్వర్లు స్తంభించిపోయాయి. దాంతో నెటిజన్లు ఆన్ లైన్ లో దర్శనమిచ్చిన 'రాధే' పైరసీ లింకును ఫాలో అయ్యారు. ఈ విషయం సల్మాన్ ఖాన్ దృష్టికి వెళ్లడంతో ఆయన తీవ్రంగా స్పందించారు.
పైరసీ దారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. అంతేకాదు, పైరసీ లింకుల ద్వారా 'రాధే' సినిమా చూసినవాళ్లు కూడా చిక్కుల్లో పడతారని స్పష్టం చేశారు. 'రాధే' చిత్రాన్ని ఒక్కసారి చూసేందుకు వీక్షణ చార్జీని రూ.249గా నిర్ణయించామని, కానీ సినిమాను పైరసీ చేశారని, ఇది చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. పైరసీని ఎవరూ ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.