Stock Market: నేడు నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
- మొన్న, నిన్న మార్కెట్లకు భారీ లాభాలు
- లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు
- సెన్సెక్స్ 290.69 పాయింట్ల నష్టం
- 77.95 పాయింట్ల నష్టంతో నిఫ్టీ
మొన్న, నిన్న రెండు రోజుల పాటు భారీ లాభాలను దండుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో పాటు, గత రెండు సెషన్లలోను మార్కెట్లు లాభాలు గడించడంతో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో ఉదయం ప్రారంభం నుంచీ నష్టాలతోనే ట్రేడ్ అయిన మార్కెట్లు చివరికి నష్టాలతోనే క్లోజ్ అయ్యాయి.
ఈ క్రమంలో సెన్సెక్స్ 290.69 పాయింట్ల నష్టంతో 49902.64 వద్ద.. నిఫ్టీ 77.95 పాయింట్ల నష్టంతో 15030.15 వద్ద ముగిశాయి. నేటి సెషన్లో పేజ్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, సిప్లా, అపోలో హాస్పిటల్స్, బాటా ఇండియా, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించాయి.
ఇక టాటా మోటార్స్, ఆర్తి ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్ సెర్వ్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు నష్టాలలో ముగిశాయి.