Bigg Boss: లాక్డౌన్లో రహస్యంగా మలయాళ 'బిగ్‌బాస్' షో షూటింగ్.. అడ్డుకున్న పోలీసులు
- చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్
- ఇప్పటికే 8 మంది సిబ్బందికి కరోనా
- అయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నిర్వాహకులు
- సెట్‌ను సీల్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు
ఓ వైపు కరోనా విజృంభణ కారణంగా కర్ఫ్యూలు, లాక్డౌన్లు విధిస్తోంటే మరోపక్క కొందరు మాత్రం తమ కార్యక్రమాలను వాయిదా వేయకుండా రహస్యంగా చేసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. మలయాళ 'బిగ్‌బాస్' షో నిర్వాహకులు కూడ ఇదే తీరును ప్రదర్శించారు.
లాక్డౌన్ ఉన్నప్పటికీ తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరించారు. మూడో సీజన్ ను లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడినప్పటికీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ షూటింగ్ నిర్వహించడంతో ఆర్డీవో ప్రీతి పర్కావి షూటింగ్ జరుగుతోన్న చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీకి పోలీసులతో కలిసి వెళ్లి దాన్ని అడ్డుకున్నారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో పాటు ఇతర సిబ్బందిని పంపించేశారు.
సెట్‌ను సీల్ చేసి, నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. హౌస్‌మేట్స్‌ను అక్కడి నుంచి హోటల్‌కు పంపించారు. మలయాళ బిగ్‌బాస్ మూడో సీజన్ కు మోహన్ లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. దేశంలో లాక్డౌన్ ఉన్న రాష్ట్రాల్లో అన్ని వ్యాపార కార్యకలాపాలు మూతపడినప్పటికీ బిగ్‌బాస్ మలయాళ నిర్వాహకులు మాత్రం తమ షోను కొనసాగించేందుకు ప్రదర్శించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.