Sensex: నేడు కూడా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు

Markets ends in losess

  • 337 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 124 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఆచితూచి వ్యవహరిస్తున్న ఇన్వెస్టర్లు

భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత కాసేపు లాభాల్లో ఉన్న మార్కెట్లు... ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు.

దీనికితోడు క్రిప్టో కరెన్సీలు క్రాష్ అయిన నేపథ్యంలో అమెరికా వాల్ స్ట్రీట్ తీవ్ర ఒడిదుడుకులకు గురికావడం కూడా మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 337 పాయింట్లు పతనమై 49,564కి పడిపోయింది. నిఫ్టీ 124 పాయింట్లు నష్టపోయి 14,906 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.47%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.87%), టైటాన్ కంపెనీ (0.79%), ఎల్ అండ్ టీ (0.44%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.39%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-2.70%), సన్ ఫార్మా (-2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.73%), యాక్సిస్ బ్యాంక్ (-1.51%), భారతి ఎయిర్ టెల్ (-1.44%).

  • Loading...

More Telugu News