Florida University: ఒక్క సెకనులో కరోనా ఉందో లేదో చెప్పేస్తారు... ఫ్లోరిడా వర్సిటీ సరికొత్త సాంకేతికత
- అత్యంత వేగంగా కరోనా టెస్టు
- బయో సెన్సర్ స్ట్రిప్ తో కరోనా పరీక్షలు
- వ్యక్తి లాలాజలంతో వ్యాధి నిర్ధారణ
- కొత్త విధానంతో సమయం, ఖర్చు ఆదా
ప్రస్తుతం కరోనా టెస్టులు చేస్తే ఫలితం కోసం ఒక రోజు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే, ఒక్క సెకనులో కరోనా ఉందో, లేదో చెప్పేసే సరికొత్త పరీక్ష విధానానికి అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం పరిశోధకులు రూపకల్పన చేశారు. అత్యంత వేగంగా కరోనా ఫలితం తెలిపే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు.
ఈ కొత్త విధానంలో బయో సెన్సర్ స్ట్రిప్ ద్వారా కరోనా పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలున్న వ్యక్తి లాలాజలం ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. బయో సెన్సర్ స్ట్రిప్ గ్లూకోజ్ టెస్ట్ స్ట్రిప్ ను పోలి ఉంటుందని ఫ్లోరిడా వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తాము రూపొందించిన కొత్త విధానంతో కరోనా పరీక్షల సమయం, ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు.