Vishnu Vardhan Reddy: మన రాష్ట్రానికి ఉన్న హక్కును ఎందుకు అడగడం లేదు జగన్ గారూ?: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnu Vardhan Reddy slams Jagan and KCR for stopping AP vehicles at boarders

  • సరిహద్దుల్లో ఏపీ వాహనాలను అడ్డుకుంటున్న తెలంగాణ
  • హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అన్న విష్ణు
  • కేసీఆర్, జగన్ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏమిటని ప్రశ్న

కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఏపీ నుంచి వస్తున్న వాహనాలను మళ్లీ అనుమతించడం లేదని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లపై విమర్శలు గుప్పించారు.

ఉన్న హక్కులను పోగొట్టుకోవడం వల్లే ఈరోజు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో... ఏపీ ప్రజలకు ఈ పరిస్థితి వచ్చిందని విష్ణు అన్నారు. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని మర్చిపోయారా కేసీఆర్ గారూ? అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి ఉన్న హక్కును ఎందుకు అడగడం లేదని జగన్ ను ప్రశ్నించారు. ప్రతిరోజు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటే... ఇద్దరు ముఖ్యమంత్రులు నోరు ఎందుకు మెదపడం లేదని నిలదీశారు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందం ఏమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News