Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits

  • 111 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 22 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 2.73 శాతం పెరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఒకానొక సమయంలో నష్టాల్లోకి వెళ్లినప్పటికీ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ తగ్గుతుండటంతో పాటు, వ్యాక్సిన్ ఉత్పత్తని పెంచే ప్రయత్నాలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు పెరిగి 50,652కి చేరుకుంది. నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 15,197 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.73%), ఎల్ అండ్ టీ (1.74%), యాక్సిస్ బ్యాంక్ (1.40%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.21%), ఐటీసీ లిమిటెడ్ (1.17%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-1.22%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.20%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.09%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.03%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.96%).

  • Loading...

More Telugu News