Komatireddy Venkat Reddy: తెలంగాణలోనూ ఏపీ తరహా కొవిడ్ చర్యలు తీసుకోవాలి: హైకోర్టును ఆశ్రయించిన కోమటిరెడ్డి

Komatireddy approaches Telangana high court

  • కొవిడ్ పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి
  • రోగులను ప్రైవేటు ఆసుపత్రులు పీడిస్తున్నాయని ఆరోపణ
  • ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్  
  • రోగుల ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టీకరణ
  • హైకోర్టులో పిల్ దాఖలు

తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, చికిత్స తీరుతెన్నులపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలోనూ ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర తరహా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.  ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేకపోవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారని కోమటిరెడ్డి వెల్లడించారు. అదే సమయంలో కొవిడ్ వ్యాప్తిని తమకు అనుకూలంగా మార్చుకున్న ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నాయని తన పిల్ లో ఆరోపించారు.

కరోనా కష్టకాలంలోనూ ప్రైవేటు ఆసుపత్రులు దయాదాక్షిణ్యాలు ప్రదర్శించడంలేదని, రోగుల పట్ల సానుభూతే లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News