Jagan: క‌లెక్ట‌ర్లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: తుపాను నేప‌థ్యంలో జ‌గ‌న్

jagan on cyclone

  • అధికారుల‌కు జ‌గ‌న్ దిశా నిర్దేశం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు రోజులు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం
  • వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్న సీఎం

యాస్ తుపాను ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉండడంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ముంద‌స్తు చ‌ర్య‌ల‌పై క‌లెక్ట‌ర్లు, అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు. యాస్ తుపానుకు సంబంధించి వాతావ‌ర‌ణ శాఖ నివేదిక‌ల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆయ‌న చెప్పారు. క‌లెక్ట‌ర్లు, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాలని జ‌గ‌న్ సూచించారు.

కాగా, అతి తీవ్ర తుపాను యాస్ తీరానికి చేరువైంది. కాసేప‌ట్లో ఒడిశాలోని బాలాసోర్ దక్షిణ ప్రాంతంలో తీరం దాటుతుందని వాతావ‌ర‌ణ శాఖ‌ తెలిపింది. ఆ సమయంలో 130 నుంచి 140 కిలోమీట‌ర్ల‌ వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని వివ‌రించింది.

  • Loading...

More Telugu News