DRDO: డీఆర్‌డీవో కరోనా ఔషధం 2డీజీ ఒక్కో ప్యాకెట్ ధర రూ.990 మాత్రమే!
- ధరను నిర్ణయించిన రెడ్డీస్ ల్యాబ్
- ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఉత్పత్తి
- నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా కరోనాకు చెక్
కరోనా మహమ్మారి పీచమణచేందుకు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించిన 2-డీజీ మందు ధర ఖరారైంది. ఒక్కో సాచెట్ ధరను రూ. 990గా నిర్ణయించింది. పొడి రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా వైరస్‌కు అడ్డుకట్ట వేయొచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ మందు ఒక్కో సాచెట్ ధరను రూ. 990గా నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు దీనిని రాయితీ ధరల్లో అందించనున్నారు.
ఈ మందు తీసుకున్న వారికి ఆక్సిజన్ అవసరం లేకుండా వేగంగా కోలుకుంటారని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. అత్యవసర వినియోగానికి ఇప్పటికే దీనికి అనుమతి లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన ఈ మందు తొలి బ్యాచ్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల అధికారికంగా విడుదల చేశారు.