Sajjala Ramakrishna Reddy: జేసీబీ, ఏసీబీ పాలన నడుస్తోందంటూ చంద్రబాబు మాట్లాడటం సరికాదు: సజ్జల

sajjala slams chandrababu

  • ఏపీలో రెండేళ్ల పాలనలోనే మునుపెన్నడూ చూడని అభివృద్ధి
  • జగన్ అభివృద్ధి కోసం నిరంతరం క‌ష్ట‌ప‌డుతున్నారు
  • ప్ర‌జ‌లంద‌రినీ తన కుటుంబంగానే భావించి పనిచేస్తున్నారు
  • ఎన్నో హామీలను జగన్‌ నెరవేర్చారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్తయిన సంద‌ర్భంగా ఆ పార్టీ నేత ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జేసీబీ, ఏసీబీ పాలన నడుస్తోందంటూ చంద్రబాబు మాట్లాడటం సరికాదని సజ్జల అన్నారు.

ఏపీలో రెండేళ్ల పాలనలోనే మునుపెన్నడూ చూడని అభివృద్ధిని వైసీపీ స‌ర్కారు సాధించింద‌ని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రతిక్షణం విలువైనదేనని భావిస్తూ సీఎం జగన్ అభివృద్ధి కోసం నిరంతరం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రినీ తన కుటుంబంగానే భావించి పనిచేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నో హామీలను జగన్‌ నెరవేర్చారని ఆయ‌న చెప్పారు. ప్ర‌జా సంక్షేమం ద్వారా అభివృద్ధి చేయాలంటూ రాజ్యాంగ రచయితల ఆలోచనను జ‌గ‌న్ అమ‌లు పరుస్తున్నారని స‌జ్జ‌ల చెప్పుకొచ్చారు.

రాష్ట్ర విభజన, కరోనాతో ఆర్థికంగా కష్టాలు వచ్చినా వాటిని అధిగమించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో జ‌గ‌న్ పాలన, సంక్షేమపరంగా అన్ని వర్గాల‌ను సమానంగా చూశార‌ని ఆయ‌న చెప్పారు. అస‌లు సీఎం జగన్ వంటి నాయకులు యుగానికి ఒక్కరే వ‌స్తారేమో అనేలా పాలన కొన‌సాగుతుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.  

సీఎం  జ‌గ‌న్ ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థను ఇప్పుడు దేశమంతా చూస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇలాంటి పథకాలను నిరంతర ప్రక్రియగా చేపట్టి అవినీతికి తావు లేకుండా జ‌గ‌న్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News