Tirumala: తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ.. సులభంగా లభిస్తున్న గదులు

Sharp Rise in Tirumala Devotees

  • శనివారం శ్రీవారిని దర్శించుకున్న 13,450 మంది భక్తులు
  • రూ. 61 లక్షల హుండీ ఆదాయం
  • భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతోంది. కరోనా ఆంక్షల కారణంగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ఇటీవల గణనీయంగా పడిపోయింది. శని, ఆదివారాల్లో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ఆలయ పరిసరాలు మళ్లీ భక్తులతో కళకళలాడాయి.

వారాంతమైన శనివారం 13,450 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 5,281 మంది తలనీలాలు సమర్పించారు. రూ.61 లక్షల హుండీ ఆదాయం లభించింది. మరోవైపు, రాష్ట్రంలో కరోనా కర్ఫ్యూ కొనసాగుతున్నప్పటికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు, భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ తిరుమలలో గదులు సులభంగానే లభిస్తున్నాయి.

  • Loading...

More Telugu News