Stock Market: స్టాక్ మార్కెట్లో జోష్.. భారీ లాభాలు!

Stock Markets closed in green

  • ప్రభావం చూపిన కరోనా కేసుల తగ్గుదల
  • సరికొత్త గరిష్ఠ స్థాయులకు చేరిన నిఫ్టీ
  • 514.56 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం దేశీయ స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని చూపింది. తాజాగా దేశంలో 1.52 లక్షల కేసులు మాత్రమే కొత్తగా నమోదు కావడం, దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా సానుకూల సంకేతాలు రావడంతో నేటి ట్రేడింగ్ భారీ లాభాలలో ముగిసింది.

పర్యవసానంగా నిఫ్టీ రికార్డు స్థాయిలో గరిష్ఠ స్థాయులకు చేరింది. నిఫ్టీ 147.15 పాయింట్ల లాభంతో 15,582.80 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 514.56 పాయింట్ల లాభంతో 51937.44 వద్ద క్లోజయింది.

ఇక నేటి ట్రేడింగులో నిప్పన్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, వేదాంత, డా.రెడ్డీ ల్యాబ్స్, టాటా స్టీల్, మారుతి సుజుకి, మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాలు గడించగా... ఎం&ఎం, గ్లెన్ మార్క్, పేజ్ ఇండస్ట్రీస్, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News