Sensex: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్.. ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 2 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 8 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- మూడున్నర శాతం వరకు లాభపడ్డ ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఏడు సెషన్లుగా కొనసాగిన ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయినప్పటికీ... ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 2 పాయంట్ల నష్టంతో 51,934కి చేరింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 15,574 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఓఎన్జీసీ (3.52%), బజాజ్ ఫైనాన్స్ (2.93%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.97%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.01%), బజాజ్ ఆటో (0.97%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.63%), ఏసియన్ పెయింట్స్ (-1.51%), యాక్సిస్ బ్యాంక్ (-0.69%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.65%).