Hyderabad: నాకసలే కరోనా.. మర్యాదగా ఆస్తి పత్రాలు ఇస్తావా? ముఖంపై దగ్గమంటావా?: మాజీ భర్తను బెదిరించిన మహిళ

wife threaten husband in the name of covid in Hyderabad

  • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఘటన
  • భార్య పేరిట ప్రశాసన్ నగర్‌లో ఇల్లు కొనుగోలు
  • ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన భార్య
  • ఇంటి పత్రాలు ఇవ్వాలంటూ బెదిరింపులు

నీ ఇష్టం మరి.. నాకసలే కరోనా సోకింది, మర్యాదగా ఆస్తిపత్రాలు ఇచ్చేస్తే వెళ్లిపోతా. లేదని యాగీ చేస్తే ముఖంపై దగ్గుతానంటూ తన మాజీ భర్తను బెదిరించిందో మహిళ. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నందగిరిహిల్స్‌లో నివసించే వ్యాపారవేత్త సంజీవరెడ్డి (70) గతంలో ఓ మహిళ (38)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో మహిళ పేరిట ప్రశాసన్‌నగర్‌లో సంజీవరెడ్డి ఇంటిని కొనుగోలు చేశాడు.

అయితే, ఆ తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంటుండగా, తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గత నెల 31న తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతడు నిరాకరించడంతో దుర్భాషలాడడమేకాక, తనకు కరోనా సోకిందని, పత్రాలు ఇవ్వకుంటే ముఖంపై దగ్గుతానని బెదిరించింది. సంజీవరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News