Sensex: రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ప్రభావం.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 132 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 20 పాయింట్లు పడిన నిఫ్టీ
- 2 శాతం వరకు నష్టపోయిన నెస్లే ఇండియా
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 132 పాయింట్లు కోల్పోయి 52,100కి పడిపోయింది. నిఫ్టీ 20 పాయింట్లు పతనమై 15,670 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.53%), ఓఎన్జీసీ (2.24%), ఎల్ అండ్ టీ (1.81%), బజాజ్ ఫైనాన్స్ (1.56%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.42%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.90%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.14%), యాక్సిస్ బ్యాంక్ (-1.11%).