Hyderabad: హైదరాబాద్‌లో నిన్న ఒకే రోజు.. ఒకే వేదికపై రికార్డు స్థాయిలో 40 వేల మందికి టీకా!
- మాదాపూర్‌లోని హైటెక్స్ వేదికగా టీకా పంపిణీ
- వచ్చినవారికి వచ్చినట్టు టీకాలు వేసిన సిబ్బంది
- గంటకు మూడు వేల మందికి టీకా
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిన్న నిర్వహించిన అతిపెద్ద టీకా కార్యక్రమంలో ఏకంగా 40 వేల మందికి టీకాలు వేశారు. క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టు టీకాలు వేసి పంపించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 700 మంది నర్సులు, 400 మంది వలంటీర్లు, 300 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గంటకు మూడువేల మందికి టీకాలు వేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని డబ్బులు చెల్లించిన 18 ఏళ్లు పైబడిన వారికి క్యూఆర్ కోడ్ కేటాయించారు. వారు టీకా కోసం అక్కడికి రాగానే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి లోపలికి పంపారు. వారు లోపలికి వెళ్లగానే అప్పటికే సిద్ధంగా ఉన్న నర్సులు వారికి టీకాలు వేసి పంపించారు. ఇలా మొత్తంగా 40 వేల మందికి టీకాలు వేశారు. కార్యక్రమం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు.
.