YS Vivekananda Reddy: వైఎస్ వివేకానందరెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన వ్యక్తిని ప్రశ్నిస్తోన్న సీబీఐ అధికారులు
- నిన్న కూడా ఇదయతుల్లాను ప్రశ్నించిన అధికారులు
- విచారణకు వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్ హాజరు
- వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి కూడా
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) విచారణ కొనసాగుతోంది. కడపలో వరుసగా మూడో రోజు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో వివేక ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన ఇదయతుల్లా, వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్ యాదవ్‌ను నిన్న ప్రశ్నించిన అధికారులు ఈ రోజు కూడా వారి నుంచి పలు వివరాలను రాబడుతున్నారు.
వివేక హత్య కేసులో అనుమానితుడిగా కిరణ్ కుమార్ యాదవ్ ఉన్నాడు. అలాగే, వివేక మాజీ డ్రైవర్ దస్తగిరి కూడా ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను విచారించిన విషయం తెలిసిందే. కాగా, గత ఏడాది విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారులకు కరోనా నిర్ధారణ కావడంతో విచారణను తాత్కాలికంగా నిలిపేసి, గత మూడు రోజులుగా మళ్లీ విచారణను కొనసాగిస్తున్నారు.