inter: తెలంగాణ‌లో ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్సర పరీక్ష‌లు ర‌ద్దు

inter second year exams cancel in ts

  • క‌రోనా వేళ‌ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణ‌యం
  • ఇప్ప‌టికే ప్ర‌థ‌మ సంవత్స‌ర ప‌రీక్ష‌లు ర‌ద్దు
  • ఈ రోజు సాయంత్రం ప‌రీక్ష‌ల ఫ‌లితాల విధానంపై ప్ర‌క‌ట‌న‌

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవ‌త్స‌ర‌ పరీక్షలను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. నిన్న తెలంగాణ‌ మంత్రి వ‌ర్గ స‌మావేశం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇందులో ప‌లు అంశాల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల‌పై కూడా చ‌ర్చించారు. ఇప్ప‌టికే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ప‌రీక్ష‌లు ర‌ద్దు అయ్యాయ‌ని అధికారులు కేసీఆర్, మంత్రుల‌కు చెప్పారు. కొన్ని రాష్ట్రాలు ఇప్ప‌టికే ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేశాయ‌ని గుర్తు చేశారు. దీంతో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ స‌రికాద‌ని మంత్రివ‌ర్గం అభిప్రాయ‌ప‌డింది.

దీంతో ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌ర‌ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం ఈ రోజు నిర్ణ‌యం తీసుకుంది. ప‌రీక్ష‌ల ర‌ద్దుతో పాటు, వాటి ఫ‌లితాల విధానాల‌పై ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్ర‌భుత్వం వివ‌రాలు తెల‌ప‌నుంది. కాగా, కరోనా విజృంభ‌ణ‌ నేపథ్యంలో ఇప్పటికే ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News