Stock Market: నేడు భారీ లాభాలలో ముగిసిన మార్కెట్లు
- ఉదయం నుంచీ లాభాలలోనే మార్కెట్లు
- 359 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
- 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ
నిన్న నష్టాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ లాభాలను చవిచూశాయి. మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో, ఉదయం మార్కెట్లు మొదలైనప్పటి నుంచీ కూడా సూచీలు గ్రీన్ లోనే కొనసాగాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 405 పాయింట్ల లాభాలను కూడా చూసింది. అయితే, చివరికి 359 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,300 వద్ద ముగియగా.. 102 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,738 వద్ద ముగిశాయి.
ఇక నేటి సెషన్లో, బజాజ్ ఫైనాన్స్, బాటా ఇండియా, బజాజ్ ఫిన్ సెర్వ్, ఫైజర్, ఎల్&టి ఇన్ఫోటెక్, ఎమ్మారెఫ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర కంపెనీల షేర్లు లాభాలు గడించగా.. బజాజ్ ఆటో, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, హీరో మోటాకార్ప్ తదితర షేర్లు నష్టపోయాయి.