Sonu Sood: ఓ అభిమాని సాహసం పట్ల చలించిపోయిన సోనూ సూద్... ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని విజ్ఞప్తి

Sonu Sood humbled after an admirer barefoot walking from Vikarabad to Mumbai
  • సోనూసూద్ పట్ల అభిమానం పెంచుకున్న వెంకటేశ్
  • వికారాబాద్ నుంచి పాదయాత్ర
  • 700 కిమీ ప్రయాణించి ముంబయి చేరిక
  • ముగ్ధుడైన సోనూ సూద్
ఇటీవల తెలంగాణ కుర్రాడు వెంకటేశ్ తన స్ఫూర్తి ప్రదాత సోనూ సూద్ ను కలవాలని ముంబయి బయల్దేరిన సంగతి తెలిసిందే. వికారాబాద్ నుంచి కాలినడకన బయల్దేరిన వెంకటేశ్ 700 కిలోమీటర్లు ప్రయాణించి ముంబయి చేరుకున్నాడు. తన కోసం అంత సాహసం చేసిన వెంకటేశ్ ను సోనూ సూద్ తన నివాసంలో కలుసుకున్నాడు. ఆ అభిమానితో ఫొటో దిగి, అతడి స్థితిగతులపై ఆరా తీశారు.

కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వెంకటేశ్ అంతదూరం నడిచి రావడం పట్ల ఆయన చలించిపోయారు. మార్గమధ్యంలో ముంబయి వచ్చేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేసినా అతడు నడిచే వచ్చాడని, అతని అభిమానం తనను నిజంగా ముగ్ధుడ్ని చేసిందని వెల్లడించారు. అయితే, దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దని, కష్టాలను కొని తెచ్చుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Sonu Sood
Venkatesh
Walking
Mumbai
Vikarabad
Telangana

More Telugu News