Ramana: హైదరాబాద్ చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ.... రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం కేసీఆర్
- తిరుమల పర్యటన ముగించుకున్న సీజేఐ
- తిరుమల నుంచి హైదరాబాదు రాక
- శంషాబాద్ లో ఘనస్వాగతం
- రాజ్ భవన్ అతిథిగృహంలో మూడ్రోజులు ఉండనున్న సీజేఐ
తిరుమల పర్యటన ముగించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ స్వాగతం పలికారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, అధికారులు కూడా ఎయిర్ పోర్టులో జస్టిస్ రమణకు స్వాగతం పలికారు.
అనంతరం జస్టిస్ రమణ రాజ్ భవన్ అతిథి గృహానికి బయల్దేరారు. ఆయన రాజ్ భవన్ అతిథి గృహంలో మూడ్రోజుల పాటు గడపనున్నారు. కాగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్ భవన్ వద్ద స్వాగతం పలకనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిశారు.