Etela Rajender: గన్​పార్కు వద్ద అమరవీరులకు ఈట‌ల‌ నివాళులు.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌ట‌న‌

etela to  resigns today

  • తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు
  • క‌రోనాపై స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేదు
  • నేను ప్ర‌జ‌ల మద్దతుతోనే గెలుస్తూ వ‌స్తున్నాను

తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ శామీర్ పేట నుంచి హైద‌రాబాద్‌లోని గన్ పార్కుకు వ‌చ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. కాసేప‌ట్లో ఆయ‌న అసెంబ్లీ స్పీక‌ర్‌కు రాజీనామా సమర్పించనున్నారు. అసెంబ్లీకి వెళ్లి అక్క‌డి స్పీకర్‌ కార్యాలయంలో రాజీనామా సమర్పించాలని ఆయ‌న‌ నిర్ణయించుకున్నారు. ఈట‌ల వెంట ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి, తుల ఉమ ఉన్నారు.

అమరవీరులకు నివాళులు అర్పించిన అనంత‌రం ఈట‌ల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. క‌రోనా క‌ట్టడికి తెలంగాణ స‌ర్కారు స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేదని మండిపడ్డారు. తాను ప్ర‌జ‌ల మద్దతుతోనే ఇన్నాళ్లూ ఎన్నిక‌ల్లో గెలుస్తూ వ‌స్తున్నానని అన్నారు.

'ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి నాకు ఇన్నాళ్లు టీఆర్ఎస్ పార్టీ బీఫాం ఇచ్చి ఉండొచ్చు కానీ, నేను గెలుస్తున్న‌ది మాత్రం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతోనే. వారే న‌న్ను గెలిపిస్తున్నారు. తెలంగాణ‌లో నేను ఎన్నో పోరాటాలు చేశాను. అధికార దుర్వినియోగం చేసి టీఆర్ఎస్ ఉప ఎన్నిక‌లో గెల‌వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌ను టీఆర్ఎస్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. క‌రోనాతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు' అని ఈట‌ల రాజేంద‌ర్ ధ్వజమెత్తారు.

'నేను 17 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ టీఆర్ఎస్ గెలుస్తోంది. నాలాంటి వారిపై ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ ఈ రోజు ఎలాంటి ధోర‌ణిని అవ‌లంబిస్తుందో ప్ర‌జ‌లు, తెలంగాణ‌ ఉద్య‌మకారులు గ‌మ‌నించాలి. హుజూరాబాద్ లో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు జ‌ర‌గ‌నున్న ఎన్నిక వంటిది. ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకుంటార‌ని ఆశిస్తున్నాను. న‌న్ను నిండు మ‌న‌సుతో హుజూరాబాద్ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించారు. తెలంగాణ ప్ర‌జ‌లు, రైతులు, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌ను కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేదు. అలాంటి వారికి గ‌ట్టిగా బుద్ధి చెప్పాలి' అని ఈట‌ల చెప్పారు.

  • Loading...

More Telugu News