Lutra Lutra: ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కల సందడి
- అంతరించి పోతున్న జాతుల్లో నీటి కుక్కలు
- ప్రధాన ఆహారం చేపలు
- సంరక్షణకు చర్యలు
అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్న అరుదైన నీటి కుక్కలు గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి. క్షీరద రకానికి చెందిన ఈ కుక్కలు నీటి వనరులున్న ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి ప్రధాన ఆహారం చేపలు.
ఇవి కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి కృష్ణా కాలువల ద్వారా ఇవి చెరువులోకి వచ్చి ఉంటాయని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడీ చెరువులో ఇవి దాదాపు 12 వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలలో కాసేపు నీటిపైకి వచ్చి తలబయటకు పెట్టి చూస్తున్నాయి. వీటి సంరక్షణకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ కుక్కల శాస్త్రీయ నామం లూట్రా లూట్రా.