AP High Court: మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు
- హైకోర్టులో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ
- సోలార్ ప్రాజెక్టుపై కోర్టును ఆశ్రయించిన టాటా సంస్థ
- టెండర్లు చట్టవిరుద్ధమని ఆరోపణ
- తాజాగా టెండర్లు పిలవాలన్న హైకోర్టు
మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు అంశంలో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ కొనుగోళ్లు (పీపీఏ) సైతం తాజాగా రూపొందించాలని స్పష్టం చేసింది.
పవర్ ప్రాజెక్టు టెండర్లు కేంద్ర విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ విద్యుత్ నియంత్రణ చట్టం విచారణాధికారి హక్కుల పరిధిని పీపీఏలో తొలగించడం చట్ట విరుద్ధమని టాటా ఎనర్జీ సంస్థ పేర్కొంది. ఒప్పందంలో వివాదం వస్తే నియంత్రణ మండలి కాకుండా ప్రభుత్వమే సమస్యను పరిష్కరించేలా ఇది వీలు కల్పిస్తుందని, ఇది టెండర్ మార్గదర్శకాలకు విరుద్ధమని టాటా ఎనర్జీ తన వాదనలు వినిపించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు వెలువరించింది.