Corona Virus: వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా సోకినా ఆసుపత్రిలో చేరే అవసరం 80% తగ్గుతుంది: కేంద్రం

Corona vaccine reduces hospitalisation by 80 pc

  • ఆక్సిజన్‌ అవసరమూ 8 శాతానికి తగ్గుదల
  • రోజువారీ కరోనా కేసుల్లో 85% తగ్గుదల
  • క్రియాశీలక కేసుల్లో 78.6% తగ్గుదల
  • పాజిటివిటీ రేటులో సైతం గణనీయ తగ్గుదల

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఒకవేళ వైరస్‌ సోకినా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 75-80 శాతం వరకు తగ్గుతున్నట్లు అధ్యయనంలో తేలిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ఆక్సిజన్‌ అవసరాన్ని సైతం ఎనిమిది శాతానికి తగ్గించినట్లు స్పష్టం చేసింది.

ఇక దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు పేర్కొంది. మే 7న నమోదైన అత్యధిక కేసులతో పోలిస్తే ప్రస్తుతం రోజువారీ కేసుల్లో 85 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు వెల్లడించింది. అలాగే మే 10తో పోలిస్తే రోజువారీ క్రియాశీలక కేసులు 78.6 శాతం తగ్గినట్లు పేర్కొంది.

ఏప్రిల్‌ 30-మే 6 మధ్య ఒక వారంలో పాజిటివిటీ రేటు 21.6 శాతంగా నమోదైందని.. అప్పటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ప్రస్తుతం వారానికి 81 శాతం తగ్గిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 513 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది.

  • Loading...

More Telugu News