Telangana: ఇంటర్ ఫస్టియర్ పాసైతే సెకండియర్ కూడా పాసైనట్టే: మార్గదర్శకాలు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana govt release Guide Lines for Inter Second year Exam results

  • ఇంటర్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ
  • ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టులకూ 35 శాతం మార్కులు
  • మార్కులతో సంతృప్తి చెందని వారికి పరీక్షలు

కరోనా మహమ్మారి కారణంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శికి విద్యాశాఖ  నుంచి ఆదేశాలు అందాయి. ఫస్టియర్‌లో ఆయా సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులనే సెకండియర్‌కూ కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్టులకు సెకండియర్‌లో 35 శాతం మార్కులను కేటాయించనున్నట్టు పేర్కొంది. అలాగే, సెకండియర్ ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు ఇవ్వనున్నట్టు తెలిపింది. ప్రైవేటుగా దరఖాస్తు చేసుకున్న వారికి 35 శాతం మార్కులు ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే, తాజా మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగైన తర్వాత కావాలనుకుంటే ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని  పేర్కొంది.

  • Loading...

More Telugu News