India: డబ్ల్యూటీసీ ఫైనల్: కష్టాల్లో టీమిండియా.. ఆరో వికెట్ డౌన్
- భారత్2ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్న కివీస్ బౌలర్లు
- 123కు పెరిగిన భారత జట్టు ఆధిక్యం
- క్రీజులో పాతుకుపోయిన రిషభ్ పంత్
సౌతాంప్టన్‌లో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 64/2తో ఆరో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఏడు పరుగులు మాత్రమే జోడించి కోహ్లీ (13) వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగు తేడాతోనే చతేశ్వర్ పుజారా (15) కూడా పెవిలియన్ చేరాడు. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాను కివీస్ బౌలర్లు మరింత ఒత్తిడిలోకి నెట్టారు.
రహానే (15), రిషభ్ పంత్ కలిసి బౌలర్లను కాసేపు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌గా రహానే పెవిలియన్ చేరాడు. అప్పటికి భారత్ స్కోరు 109 పరుగులు. అనంతరం క్రీజులోకి వచ్చిన జడేజా.. క్రీజులో పాతుకుపోయిన పంత్ కలిసి నిదానంగా ఆడుతూ స్కోరు బోర్డులో పరుగులు జోడిస్తూ పోయారు.
భారత జట్టు ఆధిక్యం పెరుగుతున్న వేళ రవీంద్ర జేడా (16)ను వాగ్నర్ బోల్తా కొట్టించాడు. ఫలితంగా 142 పరుగుల వద్ద కోహ్లీ సేన ఆరో వికెట్ కోల్పోయింది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, జెమీసన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా బౌల్ట్, వాగ్నర్ చెరో వికెట్ తీసుకున్నారు. ప్రస్తుతం భారత్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగుల చేసి న్యూజిలాండ్ కంటే 123 పరుగులు ఆధిక్యంలో ఉంది.