Nara Lokesh: విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు... పరీక్షలు రద్దు చేయించే బాధ్యత నాది: నారా లోకేశ్

Nara Lokesh comments on exams

  • ఏపీలో పరీక్షల అంశంపై రగడ
  • వద్దంటున్న విపక్షాలు
  • జరిపి తీరతామంటున్న ప్రభుత్వం
  • సుప్రీంకోర్టులో నేడు విచారణ
  • అఫిడవిట్ సమర్పించిన ప్రభుత్వం

ఏపీలో పరీక్షల అంశంపై నారా లోకేశ్ మరోసారి స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షల విషయంలో ఆందోళన చెందవద్దని, మెంటల్ మామ కొమ్ములు వంచి పరీక్షలు రద్దు చేయించే బాధ్యత తనదని లోకేశ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా తుగ్లక్ నిర్ణయాల గురించి చర్చ జరుగుతోందని తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా పరీక్షలు నిర్వహించడం ప్రమాదకరమని పేర్కొన్నారు. పరీక్షల రద్దు నిర్ణయాన్ని ప్రకటించే వరకు న్యాయపోరాటం కొనసాగిస్తానని ఉద్ఘాటించారు.

ఏపీలో పరీక్షల నిర్వహణకే కట్టుబడి ఉన్నామని ఇవాళ్టి తన అఫిడవిట్ లో వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేయడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు ఏపీ సర్కారు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా కోటి రూపాయలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. పరీక్షలకు పెద్దగా సమయం లేకుండానే ఎలా జరుపుతారని ప్రశ్నించింది. కరోనా వేళ లక్షల సంఖ్యలో ఉన్న విద్యార్థులను సిబ్బంది ఎలా సమన్వయం చేసుకుంటారని సుప్రీంకోర్టు గట్టిగా అడిగింది. దీనిపై రేపటి విచారణలో సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయం వెలువరించనుంది.

  • Loading...

More Telugu News