Tirumala: తమిళనాడులో తయారవుతున్న తిరుమల ఆలయ తాళాలు
- దిండుగల్ లో తయారవుతున్న తాళాలు
- ఒక్కోటి ఐదు కిలోల బరువుతో తయారీ
- రూ. 10 వేల ధర ఉంటుందన్న మురుగేశన్
తిరుమల ఆలయ ద్వారాలకు వేసే భారీ తాళాలు ప్రస్తుతం తమిళనాడులోని దిండుగల్ లో తయారవుతున్నాయి. మురుగేశన్ అనే తాళాల తయారీ నిపుణుడు మామిడికాయ ఆకారంలో ఐదు కిలోల బరువుండే రెండు తాళాలను తయారు చేస్తున్నారు. తాళాల తయారీలో దిండుగల్ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి వుంది. ఇక్కడి తాళాలకు మంచి గిరాకీ కూడా ఉంటుంది.
ఇక మురుగేశన్, గడచిన 43 సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఉన్నారు. చిదంబరంతో పాటు మధురై, పళని తదితర ప్రాంతాల్లోని ప్రసిద్ధ ఆలయాలకు ఆయనే తాళాలు తయారు చేశారు కూడా. తిరుమల ఆలయానికి అవసరమైన తాళాల తయారీ ఆర్డర్ ను తాను పొందానని, ఒక్కో తాళం ఖరీదు రూ. 10 వేల వరకూ ఉంటుందని ఆయన వివరించారు.