Supreme Court: తెలంగాణ జెన్​ కో, ట్రాన్స్​ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

Supreme Court Issues Contempt Summons To TS Genco and Transco

  • సీఎండీ ప్రభాకర్ రావు సహా ఉన్నతాధికారులకు సమన్లు
  • విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది ఉద్యోగుల పిటిషన్
  • ధర్మాధికారి నివేదిక ప్రకారం సగం మందిని తీసుకున్న ఏపీ

విద్యుత్ ఉద్యోగుల విభజనకు సంబంధించి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్ కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్ కో)లకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీఎసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, కార్పొరేట్ ఆఫీస్ అధికారి గోపాలరావులకు నోటీసులను ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తమను విధుల్లోకి తీసుకోవట్లేదంటూ 84 మంది విద్యుత్ ఉద్యోగులు వేసిన వ్యాజ్యాన్ని ఇవ్వాళ సుప్రీంకోర్టు విచారించింది.

ధర్మాధికారి నివేదిక ప్రకారం 1,150 మంది విద్యుత్ ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించారు. అందులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 655 మందిని విధుల్లోకి తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వమూ తీసుకున్నా.. 84 మందిని మినహాయించి విధుల్లోకి తీసుకుంది. దీంతో ఆ ఉద్యోగులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు.. అధికారులకు నోటీసులిచ్చి విచారణను జులై 16కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News