Moderna: భారత్ లో మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి మంజూరు
- కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన మోడెర్నా
- భారత ఫార్మా సంస్థ సిప్లాతో ఒప్పందం
- భారత్ లో అత్యవసర వినియోగానికి సిప్లా దరఖాస్తు
- మోడెర్నా వ్యాక్సిన్ కు డీసీజీఏ గ్రీన్ సిగ్నల్
భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తోంది. అమెరికా ఫార్మా సంస్థ మోడెర్నా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరయ్యాయి. భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఏ తాజాగా మోడెర్నా కరోనా వ్యాక్సిన్ కు పచ్చజెండా ఊపింది. ఇప్పటివరకు భారత్ లో అనుమతి పొందిన కరోనా టీకాలలో మోడెర్నా నాలుగవది. ఇప్పటివరకు కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లకు భారత్ లో గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా మోడెర్నా వ్యాక్సిన్ కూడా వాటి సరసన చేరింది. ఈ క్రమంలో, భారత ఫార్మా సంస్థ సిప్లా... మోడెర్నా వ్యాక్సిన్ డోసులు దిగుమతి చేసుకునేందుకు డీసీజీఏ ఆమోదం తెలిపింది.