Sensex: బ్యాంకుల షేర్ల దెబ్బ.. వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses

  • 185 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 66 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఒకటిన్నర శాతం నష్టపోయిన కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంకులు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు కోల్పోయి 52,549కి పడిపోయింది. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 15,748 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.75%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.39%), ఎన్టీపీసీ (1.25%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (0.83%), ఏసియన్ పెయింట్స్ (0.62%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.54%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.52%), టెక్ మహీంద్రా (-1.47%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), యాక్సిస్ బ్యాంక్ (-1.35%).

  • Loading...

More Telugu News