Drone: జమ్మూకశ్మీర్‌లో మ‌రోసారి క‌ల‌క‌లం రేపిన మూడు డ్రోన్లు

drones spot in jammu

  • ఈ రోజు తెల్ల‌వారుజామున సంచ‌రించిన డ్రోన్లు
  • మొదట కాలుచూక్‌ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోను
  • తర్వాత రత్నచక్‌ సైనిక స్థావ‌రం వ‌ద్ద‌ మరొకటి 
  • కుంజ్వానీ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద ఇంకొకటి 

జమ్మూకశ్మీర్‌లో ఈ రోజు తెల్ల‌వారుజామున‌ మ‌రోసారి డ్రోన్లు సంచ‌రించాయి. నాలుగు రోజులుగా జ‌మ్ములో డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టిస్తోన్న విష‌యం తెలిసిందే. సైన్యం అప్ర‌మ‌త్త‌మై అన్ని చర్య‌లు తీసుకుంటున్న‌ప్ప‌టికీ ఈ రోజు తెల్ల‌వారుజామున‌ జమ్ములోని ప‌లు ప్రాంతాల్లో మూడు డ్రోన్లు క‌న‌ప‌డ్డాయి.

మొదట కాలుచూక్‌ కంటోన్మెంట్ వద్ద, అనంత‌రం రత్నచక్‌ సైనిక స్థావ‌రం వ‌ద్ద‌, ఆ కొద్దిసేప‌టికే కుంజ్వానీ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద డ్రోన్లు సంచ‌రించాయి. దీంతో జమ్ము సైనిక స్థావరాల వద్ద నాలుగు రోజుల్లో క‌న‌ప‌డ్డ డ్రోన్ల సంఖ్య ఏడుకి చేరింది. ఇటీవ‌లే జమ్ము విమానాశ్రయంలోని వాయుసేన వైమానిక స్థావరంపై రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడవ‌డం క‌ల‌కలం రేపిన విష‌యం తెలిసిందే.

ఈ మ‌రుస‌టి రోజే జ‌మ్ములోని రత్నచక్‌-కాలుచక్ మిలిట‌రీ ఏరియా వ‌ద్ద రెండు డ్రోన్లు సంచ‌రించాయి. డ్రోన్లు తిరుగుతున్న‌ ప్రాంతాల్లో  సైన్యం సెర్చ్‌ ఆప‌రేష‌న్ చేప‌డుతోంది. దేశ భద్రతకు డ్రోన్ల వ‌ల్ల‌ ఏర్పడే కొత్త సవాళ్లను తిప్పికొట్టేందుకు సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను సమకూర్చాలని భార‌త ప్ర‌భుత్వం ప్రయత్నిస్తోంది.

  • Loading...

More Telugu News