Andhra Pradesh: ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!
- 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ
- ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం
- రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే:
- 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్.
- మొబైల్ వెటర్నరీ అంబులెన్సుల కొనుగోలుకు ఆమోదం.
- ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్టలో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం.
- విజయనగరం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీని యూనివర్శిటీగా మార్చేందుకు ఆమోదం.
- సత్యనారాయణపురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చాలని నిర్ణయం. విజయవాడ గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.
- టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్ల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ. 5,990 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి గ్రీన్ సిగ్నల్.
- విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ కు ఎకరాకు రూ. 25 లక్షల చెప్పున 81 ఎకరాలను కేటాయించేందుకు అంగీకారం.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరు.
- హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా రూ. 864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గానికి నీటి సరఫరాకు ఆమోదం.